![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ నుండి మిడ్ వీక్ ఎవిక్షన్ గా శ్రీసత్య బయటకొచ్చింది. అయితే గత వారమే హోస్ట్ నాగార్జున ఈ వీక్ మిడ్ వీక్ ఎవిక్షన్ ఉంటుందని చెప్పాడు.
మిడ్ వీక్ ఎవిక్షన్ అనగానే అందరూ బుధవారమో లేక గురువారమో ఉంటుందని అనుకున్నారంతా.. కానీ శుక్రవారం శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. అయితే ఈ విషయం చెప్పే ముందు కంటెస్టెంట్స్ ని ఉదయం ఆరు గంటలకే నిద్రలేపి, వారందరిని గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పాడు బిగ్ బాస్. ఆ తర్వాత "అందరికి ఈ రోజు మిడ్ వీక్ ఎవిక్షన్ ఉంటుంది. అందరూ టైం వేస్ట్ చేయకుండా తొందరగా మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి" అని చెప్పాడు. ఇంకో రెండు రోజుల్లో, ఫినాలే ఉంది.. ఇప్పుడు ఎలిమినేషన్ ఏంటి అని కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు.
ఆ తర్వాత కాసేపటికి అందరూ గార్డెన్ ఏరియాకి వచ్చారు. "ఈ హౌస్ లో ఎవరు ఫినాలేకి అర్హులు కాదని మీరు అనుకుంటున్నారో వారి పేరు చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హౌస్ లో మెజారిటీ సభ్యులంతా కీర్తి బయటకెళ్ళాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత "మీరు చెప్పినదానిని బట్టి కీర్తి ఎలిమినేషన్ అవ్వాలని అనుకున్నారు. కానీ ప్రేక్షకులు ఎవరికైతే ఓట్లు తక్కువ వేస్తారో వాళ్లే ఎలిమినేట్ అవుతారు" అని చెప్పాడు. ఆ తర్వాత శ్రీసత్య ఎలిమినేటెడ్ అని ప్రకటించాడు. "ఫస్ట్ హౌస్ లో నాతో గొడవ పడిన అమ్మాయి శ్రీసత్య" అని రేవంత్ ఏడ్చాడు. శ్రీసత్య బై చెప్పేసి వెళ్తుంటే హౌస్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు.
![]() |
![]() |